![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -428 లో.. అనామిక పది లక్షల చెక్ తీసుకొని.. వాళ్ళ నాన్న పంపే డ్రైవర్ కోసం ఎదురుచూస్తుంటుంది. ఇక అప్పుడే అక్కడికి స్వప్న వచ్చి చూస్తుంది.
ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టున్నావని స్వప్న అడుగగా.. నీకనవసరం, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయమని అనామిక చెప్తుంది. నీ మొహంలో టెన్షన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది.. నీ చీరకొంగులో ఏం దాచావో చూపించమని తన చేతిలోని చెక్ ని లాగేసుకుంటుంది స్వప్న. నన్ను వదిలేయమని అనామిక అనగానే.. మా అమ్మవాళ్ళని, మా చెల్లి కావ్యని ఎన్నిసార్లు బాధపెట్టావ్.. నీ జుట్టు నా చేతిలోకి వచ్చింది. నిన్నెలా వదిలిపెడాతనంటుంది స్వప్న. ఇక కాసేపటికి అనామికని ఇంట్లోకి తీసుకొస్తుంది స్వప్న. ఇంటి పెద్దలు ఇందిరాదేవి, అపర్ణలకి చెక్ చూపించి జరిగిందంతా చెప్తుంది స్వప్న. ఇక ఇందిరాదేవి, అపర్ణలు కలిసి అనామికని నిలదీస్తారు. అయిన తను నిజం చెప్పదు. ఇక కళ్యాణ్ పిలిచి అడుగుతారు. తను అకౌంటెంట్ కోసం రాసిచ్చిన చెక్ అని.. అది అనామికకి ఇవ్వలేదని కళ్యాణ్ చెప్తాడు. ఎందుకు చెక్ దొంగతనం చేశావని అపర్ణ, ఇందిరాదేవి, స్వప్న అనగానే.. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. నా కోడలికి నేనే చెక్ ఇచ్చాను.. వారి ఫ్యామిలీ కష్టాల్లో ఉందని నేనే చెక్ ఇచ్చానని ధాన్యలక్ష్మి అనగానే.. అందరు షాక్ అవుతారు. నీ కోడలిని బాగానే వెనకేసుకొచ్చారు గానీ నీ నగలన్నీ చేరవేస్తుందేమో చూస్కోండి అని స్వప్న చెప్పేసి వెళ్ళిపోతుంది.
మరోవైపు అప్పు, కావ్య కలిసి అసలు కావ్య వాళ్ళింటికి వెళ్తారు. తనకేం తెలియదని సాహితీ చెప్తుంది. నిజం చెప్పమని అప్పు, కావ్య అడుగగా.. కాసేపటికి అక్కడికి అసలైన అప్పు బ్యాగ్ తో వస్తుంది. ఇక కావ్య అని ఆ మాయ అనగానే.. ఓహో అంతా తెలుసుకున్నావన్న మాట అని అప్పు అంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసిన మాయ.. రోడ్డు మీద పరుగెడుతుంటే అప్పు, కావ్య తనవెంటే వెళ్తారు. అదంతా చాటుగా చూస్తున్న రుద్రాణి.. అమ్మో ఇప్పుడు ఈ మాయ వాళ్లకి దొరికితే నా ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుందని అనుకొని కారులో తన వెంటే వెళ్తుంది. తరువాయి భాగంలో హాస్పిటల్ బెడ్ మీద అసలు మాయ ఉంటుంది. ఇక బయట ఉన్న కావ్య, అప్పుల దగ్గరికి డాక్టర్ వచ్చి.. ఇప్పట్లో తన పరిస్థితి చెప్పడం కష్టమని చెప్తుంది. ఇంట్లో ఉన్న మాయాతో రాజ్ పెళ్ళి చేయాలని మా అత్తయ్య చూస్తుంది. ఇప్పుడు ఈ అసలు మాయ వస్తేనే నా కాపురం బాగుపడుతుందని కావ్య ఏడుస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |